VKB: ధరూర్ మండలం నాగారం నుంచి పరిగి వయా మోమిన్ కుర్దు గ్రామం రోడ్డుపై భారీ గుంతలు పడ్డాయి. వాహనదారులు, పలు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని వాపోతున్నారు. అధికారులు చూస్తున్నారే తప్ప మరమ్మతులు మాత్రం చేయడంలేదని పలు గ్రామాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.