NRML: నిర్మల్ పట్టణంలోని రాంరావ్ బాగ్ కాలనీలో రూ. 25 లక్షల నిధులతో హనుమాన్ ఆలయ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆలయ అభివృద్ధికి నిధులను మంజూరు చేసిన ఎమ్మెల్యేకి కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు రావుల రాంనాథ్, మేడిసెమ్మ రాజు,ముత్యం రెడ్డి, పట్టణ అధ్యక్షులు సుంకరి సాయి, ఆకుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.