WGL: నర్సంపేట MLA దొంతి మాధవరెడ్డి మాతృమూర్తి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ HNKలోని ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు. MLAలు గండ్ర, నాగరాజు, రామచంద్ర నాయక్, MP బలరాం నాయక్ ఉన్నారు.