MLG: వాజేడు మండలంలోని బొగత జలపాతం గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద రావడంతో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. అటవీ శాఖ అధికారులు స్విమ్మింగ్ పూల్లోకి దిగడానికి అనుమతి నిరాకరించారు. పర్యాటకులు జలపాతాన్ని సందర్శించవచ్చు కానీ నీళ్లలోకి దిగడానికి అనుమతి లేదని ఇవాళ స్పష్టం చేశారు.