KMR: పేద ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మీపథకం ఆర్థికంగా చేయూత నిస్తోందని సలాబత్పూర్ ఆలయ కమిటీ ఛైర్మన్ రాం పటేల్ అన్నారు. బుధవారం మద్నూర్ రైతువేదికలో కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఉపాధ్యక్షులు పరమేశ్ పటేల్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు, విఠల్ గురూజీ, వట్నాల్ రమేశ్, పాల్గొన్నారు.