SRPT: ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై లేని శ్రద్ద, రాష్ట్ర ప్రభుత్వానికి అందాల పోటీలపై ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాలని, సూర్యాపేట డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పేరుతో అనేక హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.