SRD: పోస్టల్ యాక్ట్ – 2023 అమలు చేయవద్దని కోరుతూ తపాలా ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సంగారెడ్డి హెడ్ పోస్ట్ ఆఫీస్ ముందు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. జేఏసీ నాయకులు విజయ్ కుమార్ మాట్లాడుతూ.. పోస్టల్ శాఖను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. మూడు రోజులపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.