అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి సూచించారు. ఈ సందర్భంగా అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద కలెక్టరేట్ సిబ్బందికి స్టీల్ వాటర్ బాటిళ్లను ఆమె గురువారం అందజేశారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు.