KMM: అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ వివరాలు, ఓటీపీలు చెప్పి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని ఎస్సై సంధ్య ప్రజలను కోరారు. ఖమ్మం రూరల్ మండల కేంద్రంలో గురువారం ఆమె సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. నకిలీ లింకులు ఓపెన్ చేయవద్దని, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. ఎవరైనా మోసపోతే తక్షణమే పోలీసులను ఆశ్రయించాలని ఆమె పేర్కొన్నారు.