GNTR: ప్రత్తిపాడు గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలిచ్చే వరకు పారిశుద్ధ్య పనులకు వచ్చేది లేదని ప్రత్తిపాడు పారిశుద్ధ్య కార్మికులు స్పష్టం చేశారు. పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ.. ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకున్న పనిచేస్తున్నా, కనీసం గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. జీతం అడిగితే పనికి రావద్దంటున్నారని అన్నారు.