HYD: మహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై తెలంగాణ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా ఎన్నికల సంఘాన్ని బీజేపీ నేతలు కలిశారు. మంత్రివర్గ విస్తరణను వెంటనే ఆపాలని ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసే వరకు అజారుద్దీన్ మంత్రి పదవిని వాయిదా వేయాలని, లేకపోతే ఓ వర్గం ఓట్లపై ప్రభావం పడే అవకాశముందని ఈసీకి వినతి చేశారు.