NZB: నగరంలో 100 రోజుల కార్యక్రమంలో భాగంగా, 85వ రోజుకు పనులు చేరాయని అన్నారు. మంగళవారం అన్ని సర్కిళ్లలో పిచ్చి మొక్కలను తొలగించడం, దోమల నివారణ, మురికి కాలువలు, రోడ్లను ఊడ్చడం, ఆయిల్ బాల్స్ విడుదల, నీటి కాలువల పూడిక తొలగింపు, క్లోరినేషన్ పరీక్ష, ఫోగ్గింగ్ ఆపరేషన్ వంటి కార్యక్రమాలు చేపట్టారు. తడి, పొడి, ప్రమాదకరమైనవిగా విభజించడం ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు.