BHPL: చిట్యాల మండల కేంద్రంలో సోమవారం ABVP రాష్ట్ర కన్వీనర్ రాజ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం శంకుస్థాపన జరిగిన బస్టాండ్ ఇంకా ప్రారంభం కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చొరవ తీసుకొని బస్టాండ్‌ను ప్రారంభించాలని, లేదంటే దీపావళి సందర్భంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు ప్రారంభిస్తామని హెచ్చరించారు.