BDK: గుండాల మండల కేంద్రంతో పాటు మామకన్ను గ్రామంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం. విద్యా చందన విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు నిమిత్తం స్థల సేకరణను శనివారం పరిశీలించారు. అనంతరం కాచనపల్లి, ముత్తాపురం, లింగగూడెం, రోళ్లగడ్డ, గుండాల గ్రామాల్లో నర్సరీలను సందర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, పాల్గొన్నారు.