ప్రకాశం: ముప్పవరం గ్రామంలో ట్రై సైకిల్స్ పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పదిమంది దివ్యాంగులకు ట్రై సైకిల్స్‌ను ఆయన పంపిణీ చేశారు. దివ్యాంగులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి చెప్పారు. ఇప్పటివరకు జైపూర్ అలింకో సంస్థ ద్వారా 40 ట్రైసైకిల్ అందించామన్నారు.