బడ్జెట్లో రైతులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా శుభవార్త చెప్పారు. పీఎం కిసాన్ క్రెడిట్ కార్డుల సంఖ్యను రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో 7.7 కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. రైతులకు తక్కువ ధరలకే ఎరువులు అందించేందుకు ఈశాన్య రాష్ట్రాలలో మూడు యూరియా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. బీహార్లో మఖానా బోర్డు నెలకొల్పుతామన్నారు.