NLG: మిర్యాలగూడ రైల్వే స్టేషన్లో డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్ ఆధ్వర్యంలో శనివారం UTS మొబైల్ అప్లికేషన్ ద్వారా టికెట్ తీసుకునే విధానంపై రైల్వే ప్రయాణికులకు అవగాహన కల్పించారు. రైల్వే ప్రయాణికులు క్యూలైన్లో నిలబడాల్సిన అవసరం లేకుండా మొబైల్ అప్లికేషన్ ద్వారా త్వరగతిన టికెట్ తీసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.