MDK: నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిరూపయోగంగా మారాయి. నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడం కోసం ప్రభుత్వం 80 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టి దాదాపు 5 సంవత్సరాలు గడుస్తుంది. నిర్మాణాలు పూర్తయినప్పటికీ నిరుపేదలకు కేటాయించడంలో నిర్లక్ష్యం వహించడంతో అవి పూర్తిగా శిథిలావస్థకు చేరాయి.