MDK: కుక్కల దాడిలో 8 గొర్రెలు మృతి చెందిన ఘటన చిలిపి చెడు మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. సోమక్కపేటకు చెందిన రైతు శేరి అర్జున్ గొర్రెల పెంపకంపై జీవనం కొనసాగిస్తున్నాడు. గొర్రెల మందపై వీధి కుక్కలు దాడి చేయడం వలన 8 గొర్రెలు మృతిచెందగా, 12 గొర్రెలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. రైతును ప్రభుత్వం అదుకోవాలని తోటి రైతులు కోరారు.