కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో పోస్టల్ శాఖ గురించి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోస్టల్ శాఖలో మార్పులు తీసుకొస్తున్నామని ఆమె తెలిపారు. దేశంలోనే అతిపెద్ద లాజిస్టక్ వ్యవస్థగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు సాధించిందని చెప్పారు.