AP: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బోర్డు తీపి కబురు చెప్పింది. ఇవాళ్టి నుంచి తిరుమల అన్న ప్రసాదంలో మసాలా వడను యాడ్ చేయనున్నారు. అక్కడి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ఉ.10.30 గంటలకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేతుల మీదుగా వాటిని భక్తులకు వడ్డించనున్నారు. జనవరి నెలలో వడను ప్రయోగాత్మకంగా వడ్డించగా.. ఇప్పుడు మెనూలో చేర్చి భక్తులకు వడ్డించనున్నారు.