అనకాపల్లి జిల్లాలో పెద్ద ఎత్తున ఏర్పాటు అవుతున్న పరిశ్రమలలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ నక్కపల్లిలో ఏర్పాటు అయ్యే మిట్టల్ స్టీల్ ప్లాంట్లో లక్ష ఉద్యోగ అవకాశాలు ఉండగా కనీసం 20,000 ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలన్నారు.