GNTR: ముఖ్యమంత్రి సహాయనిధి సంబంధించి ప్రత్తిపాడు నియోజకవర్గ లబ్దిదారులకు మొత్తం 31మందికి రూ.39,75,543 మంజూరైయ్యాయి. వాటిలో రూ.24,76,457 విలువ గల 26చెక్కులను గురువారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులకు అధికారులు అందజేశారు. ఈ చెక్కులను ఈ నెల 8వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యలయంలో లబ్దిదారులకు పంపిణి చేయనున్నారు.