నంద్యాల: ఆత్మకూరు ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని కొత్తపల్లి మండలం గుమ్మడాపురం బీట్లో వేటగాళ్ళు విద్యుత్ వైర్లతో వేసిన ఉచ్చులో పడి 2 కణతులు మృతి చెందాయి. అదే విధంగా కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామ సమీపంలో ఓ నెమలి అనుమానస్పదంగా మృతి చెందింది. ఫారెస్ట్ అధికారులు వేటగాళ్లు పరారు కాగా.. మరో అనుమానస్పద వ్యక్తిని బుధవారం అదుపులో తీసుకొని విచారణ చేస్తున్నారు.