ATP: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫీజుల విషయంలో విద్యార్థులపై ఒత్తిడి తేవొద్దని ఎంఈఓ నాగరాజు, సీఐ శివగంగాధర్ రెడ్డి సూచించారు. తాడిపత్రి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రైవేట్ స్కూళ్ల కరస్పాండెంట్లు, హెచ్ ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ఎస్ఐ గౌస్ బాషా, తదితరులు పాల్గొన్నారు.