VSP: మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధి మారుతి సర్కిల్ ఐఎన్ఎస్ డేగా ప్రాంగణంలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి పక్కనే ఉన్న పొదల్లో మృతదేహాన్ని చూసి సమాచారం ఇచ్చాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ హాస్పిటల్కి తరలించి ఘటనపై కేసు నమోదు చేశారు.