సత్యసాయి: హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నేడు విజయవాడ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఉదయం 10.30 గంటలకు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట తన లాయర్లతో కలిసి ఆయన హాజరవుతారు. ఇప్పటికే ఆయన విజయవాడకు చేరుకున్నారు. పోక్సో కేసులో బాధితురాలి పేరు ప్రస్తావించడంతో మాధవ్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.