SKLM: నరసన్నపేటలోని శ్రీనివాస్ నగర్లో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పట్టాన నాగేశ్వరరావు ఇంట్లో ఈ చోరీ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు తీర్థ యాత్రలకు వెళ్లడంతో ఎంత నష్టం వాటిల్లిందో తెలియరాలేదు. మరో మూడు ఇళ్లల్లో చోరీకి ప్రయత్నం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా సీఐ జే శ్రీనివాసరావు, ఎస్ఐ దుర్గాప్రసాద్ ఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.