VSP: విద్యుత్ వినియోగదారులు అదనపు లోడ్ ఛార్జీలతో 50 శాతం రాయితీపై చెల్లించుకోవాలని నర్సీపట్నం డీఈ రామకృష్ణ తెలిపారు. అధిక లోడ్ కలిగిన గృహోపకరణాలు వాడేవారు తప్పనిసరిగా అదనపు లోడ్ ఛార్జీలు చెల్లించాలన్నారు. 1 కిలోవాట్‌కు రూ.2250 కాగా, రూ.1250 చెల్లిస్తే సరిపోతుందన్నారు. 5 కిలోవాట్ వరకు ఈ రాయితీ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.