CTR: రూరల్ మండలం దిగువమాసపల్లె గ్రామపంచాయితీ పరిధి హరిజనవాడలో శనివారం ఉదయం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఒకేసారి పెన్షన్ పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని MLA అన్నారు.