AP: రాష్ట్ర ప్రజల తరఫున ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కారు ఫలితాలు ఎలా ఉంటాయో ప్రజలు చూస్తున్నారని, ప్రతి ఇంటికీ కుళాయి ఇవ్వాలనేది ప్రధాని మోదీ ఆలోచన అని పేర్కొన్నారు. గురజాడ పద్యంతో బడ్జెట్ స్పీచ్ ప్రారంభించారని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వంలో జల్ జీవన్ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు.