MNCL: జన్నారం మండల ఇన్చార్జి ఎంపీడీవోగా ఉమర్ షరీఫ్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు జన్నారం మండల ఎంపీడీవోగా పనిచేసిన శశికళ ఠాకూర్ గురువారం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఆమె స్థానంలో హాజీపూర్ ఇంఛార్జ్ ఈఓపిఆర్డిగా పనిచేస్తున్న ఉమర్ షరీఫ్ ఉదయం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఇంఛార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టారు. ఆయనను పలువురు అభినందించారు.