ASF: కాగజ్‌నగర్‌లో నేరాల నియంత్రణ కోసమే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ రామానుజన్ అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు కాగజ్‌నగర్‌లోని శ్రీబాబు కాలనీ, మారుతీనగర్‌లో శనివారం ఉదయం కార్డెన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ఆయన మాట్లాడుతూ.. నెంబర్ ప్లేట్లు, ధృవపత్రాలు లేని వాహనాలను సీజ్ చేశామన్నారు. కార్డెన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశం ప్రజలను అప్రమత్తం చేయడమే అన్నారు.