TG: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు చేయలేదని మాజీ MLA జగ్గారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు ఏడాదికి రూ.లక్ష కోట్ల పన్ను కడుతున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో BJPని 8 సీట్లలో గెలిపించారని తెలిపారు. బడ్జెట్‌పై కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చెప్తారని ప్రశ్నించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసిందని విమర్శించారు.