కృష్ణా: విజయవాడలో టాలీవుడ్ నటి నభా నటేశ్ సందడి చేశారు. శనివారం మహాత్మాగాంధీ రోడ్డులోని ఓ షో రూమ్ ప్రారంభానికి వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. తెలుగు సినిమాలో నటించిన తర్వాత అనేకసార్లు విజయవాడ వచ్చారని, దుర్గమ్మను దర్శించుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నభా నటేశ్ను చూసేందుకు, ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపారు.