VZM: జిల్లాలో MLC ఎన్నికల కోడ్ అమలుతో జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతీ సోమవారం నిర్వహించే PGRS రద్దు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ జనవరి 29 నుండి మార్చి 8 వరకు అమలులోకి ఉన్నందున పోలీస్ గ్రీవెన్స్ రద్దు చేసినట్లుగా కోడ్ ముగిసిన తరువాతనే తిరిగి జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తామని అన్నారు.