W.G: భీమవరం పట్టణంలోని పలు షాపులలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ షాపుల యజమానులకు ప్లాస్టిక్ వాడకంపై కలిగే నష్టాలను వివరించారు. పేపర్ కవర్లను, గుడ్డ సంచులను వాడే విధంగా అవగాహన కలిగించారు. ఈ కార్య క్రమంలో భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.