KNR: గంగాధర మండలంలో బ్లాక్ ఏరియా ప్రాంతంలోని రైతు వేదికలో గురువారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులుగా, వార్డ్ మెంబర్ అభ్యర్థులుగా పోటీ చేసే వారికి ఎంపీడీవో ధమ్మని రాము అవగాహన సదస్సు నిర్వహించారు. ఓటింగ్ ప్రక్రియ, ఎన్నికల నియమావళిపై, అభ్యర్థులకు వివరించారు. ఈ కార్య క్రమంలో మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.