KNR: శంకరపట్నం మండలంలోని కొత్తగట్టులో వెలసిన శ్రీ మత్స్యగిరీంద్ర స్వామి దేవాలయ రాజగోపుర నిర్మాణానికి భక్తులు భారీ విరాళం ప్రకటించారు. కందుల విజయ-లింగయ్య దంపతులు రూ. 1,01,116 విరాళాన్ని మంగళవారం అందజేశారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో దాతలను ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు.