SRPT: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కోహెన్స్ ఫార్మసీ కంపెనీలో షార్ట్ సర్క్యూట్తో గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను చికిత్స కోసం పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గ్యాస్ లీకై ఇద్దరు అస్వస్థతకు గురికావడంతో ఆగ్రహించిన స్థానికులు కంపెనీ ముందు ఆందోళన చేపట్టారు. సీపీఐ (ఎంఎల్) నాయకులు కంపెనీ ముందు ధర్నా నిర్వహించారు.