GDWL: గట్టు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ప్రత్యేక శిబిరం ఐదో రోజుకు చేరుకుంది. గొర్లఖాన్ దొడ్డిలో వాలంటీర్లు మండుటెండలోనూ శ్రమదానం చేసి వీధులను శుభ్రపరిచారు. ప్రభుత్వ పథకాలపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. సర్పంచ్ శ్వేత ఆంజనేయులు సౌకర్యాలు కల్పించారు. విద్యార్థుల సేవాభావాన్ని గ్రామస్థులు అభినందించారు.