MNCL: మంచిర్యాల పట్టణంలో గురువారం మంత్రుల పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ వాహనాల రాకపోకలు నిషేధించినట్లు పేర్కొన్నారు. లక్షెట్టిపేట, మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్ వైపు నుంచి వచ్చే వాహనాలు పోలీస్ శాఖ సూచనలు పాటించాలన్నారు. ప్రజలు నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని కోరారు.