NZB: ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న వీడీసీ సభ్యులకు, గౌడ కులస్థులకు మధ్య జరిగిన ఘర్షణలు ఎట్టకేలకు ముగిశాయి. ఈ వివాదం కారణంగా గ్రామంలో 144 సెక్షన్ విధించారు. సమస్య పరిష్కారం కోసం ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి ఇరువర్గాలతో స్థానిక రైతు వేదిక వద్ద సమావేశం నిర్వహించారు. అధికారులు సామరస్యంగా సమస్యను పరిష్కరించారు.