PDPL: కొత్త ఆర్టీసీ డిపో నిర్మాణం కోసం ప్రదేశంలో ఉన్న చెట్లు పర్యావరణ నియమావళి ప్రకారం నరికి తరలించేందుకు ఆసక్తిగల కాంట్రాక్టర్ల నుంచి టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. టేకు, వేప, అశోక సహా 147 చెట్ల తొలగింపుకు దరఖాస్తులు అక్టోబర్ 16లోపు పెద్దపల్లి స్టేషన్ మేనేజర్ లేదా గోదావరిఖని డిపో సమర్పించాలన్నారు.