NLG: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తిప్పర్తి మండల కేంద్రానికి జూనియర్ కళాశాల మంజూరు చేయడంతో మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కళాశాల ఏర్పాటు స్థలాన్ని పరిశీలించారు. ఆదర్శ పాఠశాల సమీపంలో స్థలాన్ని సర్వే చేసి నివేదికను అందజేయాలని తహసీల్దార్ స్వప్నను ఆదేశించారు. ఆమె వెంట తాహసీల్దార్ స్వప్న, ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.