GDWL: గట్టు మండలం పరిధిలోని ఇందువాసి గ్రామంలో దసరా పండుగ రోజు నుంచి భగీరథ మిషన్ నీరు రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో నీరు నిలిచిపోవడంతో తాము బోర్లలో, పొలాల దగ్గరకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నామని తెలిపారు. ఈ సమస్యపై అధికారులకు ఫిర్యాదు చేసినా, వారు నిధుల కొరత ఉందని చెబుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు.