RR: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో రాచకొండ పోలీసుల సేవలు అభినందనీయమని సీపీ సుధీర్ బాబు అన్నారు. బుధవారం సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎన్బీడబ్ల్యూ ఫ్రీ కమిషనరేట్‌గా రాచకొండ కమిషనరేట్ నిలిచిందని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు.