30 days traffic restrictions at hyderabad chintal market
30 days traffic restrictions:హైదరాబాద్ చింతల్ మార్కెట్ (chintal market) వద్ద ట్విన్స్ బాక్స్ కల్వర్ట్‌పై జీహెచ్ఎంసీ పనులు జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి వచ్చే నెల (మే) 28వ తేదీ వరకు నెల రోజులు ట్రాఫిక్ మళ్లించారు. రద్దీ తగ్గించడానికి ప్రత్యామ్నాయ రహదారులను ఉపయోగించాలని ప్రయాణికులకు (passengers) అధికారులు సూచించారు. పనులు పూర్తి అయ్యేందుకు ప్రయాణికులు సహకరించాలని కోరారు.
చింతల్ మెయిన్ రోడ్ నుంచి పద్మా నగర్ రింగ్ రోడ్ వైపు వచ్చే వాహనాలను ఎల్లమ్మ దేవాలయం ఎడమ వైపు-వాణి నగర్-కుత్బుల్లాపూర్ గ్రామం వద్ద మళ్లిస్తారు.
పద్మానగర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే ట్రాపిక్‌ను మాణిక్యనగర్ కమాన్- ఢిల్లీ పబ్లిక్ స్కూల్- పాండ్ విగ్రహాం- చింతల్ ప్రధాన రహదారి నుంచి మళ్లిస్తారు.
పద్మానగర్ రింగ్ రోడ్ నుంచి వచ్చే ట్రాఫిక్ ఫైన్ చికెన్ మార్కెట్-అంబేద్కర్ నగర్ రోడ్- అంబేద్కర్ విగ్రహం-కుడివైపు- రాంరెడ్డి నగర్- రెయిన్ బో హై స్కూల్- ఐడీపీఎల్ మెయిన్ రోడ్ వద్ద నుంచి మళ్లిస్తారు.
పై సూచనలను పాటించి.. ప్రయాణికులు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు కోరుతున్నారు.