SRPT: పెన్పహాడ్ మండలం అనంతారం ఎక్స్ రోడ్ వద్ద శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. చెట్టుకు ఉరేసుకొని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు గుర్తించారు. మృతుడు గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.