MDK: అల్లాదుర్గం ఎంపీడీవో కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీలతో గురువారం సమావేశం నిర్వహిస్తామని ఎంపీడీవో చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పోలింగ్ స్టేషన్ ముసాయిదాపై చర్చించడం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని గమనించి, ఆయా పార్టీల నాయకులు సకాలంలో హాజరుకావాలని కోరారు.